టాలీవుడ్: 2019 సంక్రాతి విన్నర్ గా నిలిచిన సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వం లో, దిల్ రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా F2 – ఫన్ అండ్ ఫస్ట్రేషన్. ప్రస్తుతం ఈ సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నిన్న కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ వివిధ బాగాలకి చెందిన సినిమాలకి అవార్డులు ప్రకటించింది. అందులో బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ లో ‘ఇండియన్ పనోరమా’ అవార్డు లభించింది. ఇదే క్యాటగిరి లో హిందీ లో ‘గల్లీ బాయ్’, ‘ఉరి’.. మలయాళం లో ‘జల్లికట్టు’ లాంటి సినిమాలకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా ద్వారా అవార్డులు లభించాయి.
దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పైన విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్ కూడా రూపొందించబడుతుంది. కరోనా వల్ల ఈ సినిమా ఇంకా మొదలవలేదు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా అదనపు ఆకర్షణ. అయితే 2019 లో తెలుగులో ఇంకా చాలా మంచి సినిమాలు విడుదలయ్యాయి, కానీ వాటికి రాకుండా ఈ సినిమాకి అవార్డు ఎందుకు వచ్చిందో అని కొందరు సినీ అభిమానులు సోషల్ మీడియా లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాని నటించిన ‘జెర్సీ’ సినిమాకి చాలా ప్రశంసలు లభించాయి. అలాంటి సినిమాకి అవార్డులు రావాలి అని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేసారు.