మాలీవుడ్: లాక్ డౌన్ వల్ల మళయాళం ఇండస్ట్రీ సినిమాలు పాన్ ఇండియా పరంగా ఫేమస్ అయ్యాయి. ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మంది మళయాళం సినిమాలని ఆదరించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చాలా మంది మళయాళం నటులకి పాన్ ఇండియా గుర్తింపు లభించింది. ఆ స్టార్స్ నుండి సినిమా వస్తుందంటే మంచి ఆదరణ లభిస్తుంది. ఇదే అవకాశంగా తీసుకుని మళయాళం ఇండస్ట్రీ నుండి ఎక్కువ ఓటీటీ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇందులో ఫాహద్ ఫాసిల్ సినిమాలు ఎక్కువగా ఉంటున్నాయి. ‘జోజి’, ‘సి యూ సూన్’ లాంటి సినిమాల్ని విడుదల చేసిన ఫాహద్ ‘మాలిక్’ అనే మరో సినిమాని విడుదలకి సిద్ధం చేసారు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
‘మా వాడు 6 ఏళ్ళ సమయం లోనే చావు నుండి బయటపడ్డాడు, అప్పుడు చనిపోయినా బాగుండేది’ అనే ఒక తల్లి వాయిస్ తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. మరి అది ఎవరిగురించి అనే క్లారిటీ రాలేదు. తర్వాత తన ఏరియా లో ఉండే ఒక మతానికి చెందిన తన ప్రజల కోసం పోరాడే వ్యక్తి పాత్రలో ఫాహద్ నటించినట్టు కొన్ని సీన్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో ఫాహద్ రెండు మూడు గెట్ అప్ లలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో మరో స్పెషాలిటీ ఏంటంటే యాక్షన్. యూత్ గెట్ అప్ లో ఉన్న ఫాహద్ యాక్షన్ స్తంట్స్ తో మెప్పించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాని జులై 15 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల చేయనున్నారు.