టాలీవుడ్: గత కొన్ని సంవత్సరాలుగా మలయాళం సినిమా ఇండస్ట్రీ నుండి గొప్ప గొప్ప నటులు, ఇక్కడి నుండి విడుదలయ్యే సినిమాలకి గుర్తింపు కూడా నేషనల్ వైడ్ లభింస్తుంది. ఒకప్పుడు అవార్డు సినిమాలు ఎక్కువగా తీసే ఇండస్ట్రీ ఇపుడు అవార్డ్స్ మాత్రమే కాదు జనాదరణ చూరగొనే సినిమాలు కూడా తీస్తుంది. ఇపుడున్న జెనెరేషన్ లో దుల్కర్, ఫాహద్ ఫాజిల్, నివిన్ పాలీ మలయాళం ఇండస్ట్రీ నుండి బాగా షైన్ అవుతున్నారు.
చాలా ఏళ్లుగా మలయాళం లో నటిస్తున్న ఫాహద్ అక్కడ మంచి నటుడిగా పేరు సంపాదించాడు. 2018 లో నేషనల్ అవార్డు కూడా పొందాడు. ఈ మధ్య విడుదలైన ట్రాన్స్ సినిమాలో ఫాహద్ నటన చూసి చాలా మంది మెచ్చుకున్నారు. కంటెంట్ సో సో గా ఉన్న ఈ సినిమా మొత్తం తన బుజాలపైన మోసి తన కోసమే సినిమా చూసేలా నటించాడు. ఈ నటుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో విలన్ గా చేస్తూ మొదటి సారి తెలుగులో కూడా అరంగేట్రం చేయనున్నాడు.
ఫాహద్ ప్రస్తుతం నటిసున్న మలయాళం సినిమా ‘మాలిక్’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో ఫాహద్ ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ లో గల్లీ లో ఫ్రెండ్స్ తో తిరిగి స్మగ్గ్లింగ్ లాంటివి చేసి వాల్ల ఏరియా నుండి ఒక శక్తి గా ఎదిగి రాజకీయాలని ప్రభావితం చేసే వ్యక్తి గా ఎదగడం లాంటి అంశాలు చూపించారు. ఒక ముస్లిం వ్యక్తి పాత్రలో ఫాహద్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా మతం వెనక ఉన్న పాలిటిక్స్ పై సెటైరికల్ సినిమా అని అర్ధం అవుతుంది. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 13 న విడులవుతుంది.