టాలీవుడ్: అల్లు అర్జున్ ప్రస్తుతం హీరోగా, రంగస్థలం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఒక పూర్తి విలేజ్ నేపథ్యంలో గంధపు చెక్కల స్మగ్గ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రియలిస్టిక్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటి వరకు విడుదలైన బన్నీ లుక్స్ ఇందుకు నిదర్శనం. చాలా ప్రతిష్టాత్మకంగా ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఈ సినిమా కోసం బన్నీ మరియు సుకుమార్ కష్టపడుతున్నారు. ఈ సినిమాలో విలన్ గా ముందు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అనుకున్నారు. కానీ కరోనా తర్వాత పరిస్థితుల వలన డేట్స్ అడ్జస్ట్ అవకపోవడం తో విజయ్ సేతుపతి ఈ సినిమానుండి తప్పుకున్నాడు.
విజయ్ సేతుపతి తర్వాత చాలా మంది పేర్లు పరిశీలించిన ఈ సినిమా టీం ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా విలన్ ని ప్రకటించింది. మలయాళం ఇండస్ట్రీ లో మంచి పేరున్న నటుడిగా , జాతీయ అవార్డు విన్నర్ గా తన నటనతోనే అభిమానుల్ని సంపాదించిన ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో బన్నీ కి విలన్ గా నటిస్తున్నాడు. ఫాహద్ సినిమాలకి ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక్కడ కూడా ఫాహద్ కి అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో బన్నీ కి జోడీ గా రష్మిక నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి సుక్కు ఫేవరేట్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ఆగష్టు 13 న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.