fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsకొత్త ప్రయోగం తో వస్తున్న మలయాళం స్టార్ హీరో

కొత్త ప్రయోగం తో వస్తున్న మలయాళం స్టార్ హీరో

FaahadLatestMovie CUSoon TrailerReleased

మాలీవుడ్: మళయాళం లో ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్ కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. చిన్న ఆర్టిస్ట్ గా జర్నీ ప్రారంభం చేసి మంచి నటన తో ఈ మద్యే వచ్చిన డబ్బింగ్ సినిమా ‘ట్రాన్స్’ తో తెలుగు లో కూడా అభిమానులని సంపాదించాడు. ఈ సినిమా లో ఫాహద్ యాక్టింగ్ చూసాక అతని పాత సినిమాల్ని కూడా ఒక లుక్ వేస్తున్నారు సినిమా అభిమానులు. ప్రస్తుతం ఈ హీరో మరో అద్భుత ప్రయోగం తో వస్తున్నాడు. ఫాహద్ ‘సీ యూ సూన్’ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1 న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే సినిమా మొత్తం ఐ ఫోన్ 11 ప్రో తో షూట్ చేసారు.

లాక్ డౌన్ సమయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 70 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమాను పూర్తిగా ఐ ఫోన్ లో చిత్రీకరించడం విశేషం.ఫాహద్, రోషన్ మాథ్యూస్, దర్శనా రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో మహేష్ సి. నారాయణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. షాట్ ఆన్ ఐఫోన్ చిత్రం అంటూ ప్రచారం చేస్తూ ఈ సినిమాకి హైప్ తీసుకొస్తున్నారు. సినిమా ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఎక్కడా నిరాశ పరచలేదు. ఐఫోన్ అయినా స్పష్ఠమైన విజువల్స్ తో వండర్ ఫుల్ క్వాలిటీతో ఆకట్టుకుంటోంది. గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద అసెట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular