మాలీవుడ్: ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచం లో సినిమా పరిధి , స్థాయి బాష అనే బారియర్ ని దాటుకుని అన్ని ప్రాంతాలకి దూసుకెళ్తుంది. ఓటీటీ లు రావడం తో ఎక్కడో విడుదలైన సినిమాలు కూడా క్షణాల్లో సినీ అభిమానుల చేతుల్లోకి వస్తున్నాయి. ఒక బాష నటులకి మరొక భాషలో కూడా ఫ్యాన్ బేస్ పెరిగి వేరే భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళ రీజనల్ భాషల్లో రూపొందే సినిమాలు కూడా ఇక్కడ డబ్ అయ్యి మార్కెట్ కూడా పెరుగుతుంది. ఇలా మళయాళ నటుడు ఫాహద్ కి తెలుగు లో కూడా ఫ్యాన్ బేస్ మెల్లి మెల్లిగా పెరుగుతుంది. మలయాళం లో రూపొందిన ‘ట్రాన్స్’ సినిమాలో కనబరిచిన నటనకి తెలుగు వారు కూడా ఫిదా అయిపోయారు.
ఈ నటుడు తెలుగులో పుష్ప సినిమాలో విలన్ గా చేస్తున్నారు. లాక్ డౌన్ మొదలయినప్పటినుండి మలయాళం బాష నుండి చాలా సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాయి. చిన్న సినిమాలే కాకుండా పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదలయ్యాయి. లిమిటెడ్ బడ్జెట్ తో లిమిటెడ్ డేస్ లో లిమిటెడ్ రిసోర్సెస్ తో కంటెంట్ పరంగా కాంప్రమైస్ కాకుండా సినిమాలని రూపొందిస్తూ వేరే ఇండస్ట్రీ లకి ఆదర్శంగా నిలుస్తున్నారు మలయాళం ఇండస్ట్రీ. కేవలం ఫాహద్ నటించిన ‘సి యూ సూన్ ‘, ‘జోజి’ సినిమాలు అతి తక్కువ టైం లో రూపొంది విడుదలయ్యి హిట్ అయ్యాయి. ఇపుడు ఫాహద్ నటించిన మరొక సినిమా ఓటీటీ లో విడుదలవనుంది. ఫాహద్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘మాలిక్’ జులై 16 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలవనుంది.