fbpx
Saturday, November 30, 2024
HomeNationalకో-విన్‌ నకిలీ యాప్‌: కేంద్రం హెచ్చరిక

కో-విన్‌ నకిలీ యాప్‌: కేంద్రం హెచ్చరిక

FAKE-COWIN-APPS-IN-GOOGLE-PLAY

న్యూఢిల్లీ: కరోనా అంతం కోసం అతి త్వరలోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ త్వరలోనే అందుబాటులోకి రానున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ‘కో-విన్‌’ యాప్ పేరుతో నకిలీ, అక్రమ యాప్‌లు యాప్‌లో స్టోర్‌లో ఉన్నాయని వాటి విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సదరు యాప్‌ల మాయలోపడి వ్యక్తిగత డేటాను, ఇతర సమాచారాన్ని పంచుకోవద్దని తెలిపింది. అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ కూడా చేయవద్దని హెచ్చరించింది.

వ్యాక్సిన్‌ పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం కోవిన్‌ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకురానున్నట్లు ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక యాప్ కు సరిపోలిన నకిలీ యాప్‌లతో అక్రమార్కులు అప్పుడే తమ పని మొదలు పెట్టేశారని తెలుస్తోంది.

కోవిన్ పేరుతో ప్లే స్టోర్‌లో ఇప్పటికే 3 యాప్స్ ఉన్నాయి. వీటిని ఇప్పటికే 10వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ కో-విన్‌ యాప్‌ ను అధికారికంగా ఆవిష్కరించినపుడు, విస‍్తృత సమాచారాన్ని అందిస్తామని స్పష్టం చేసింది.

కాగా సీరం రూపొందిస్తున్న కోవీషీల్డ్‌, భారత్‌బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున​ కోవాగ్జిన్ వ్యాక్సీన్లను దేశంలో అత్యవసర వినియోగానికి గాను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే తొలి దశలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోవిన్‌ను ప్రవేశపెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular