fbpx
Saturday, January 18, 2025
HomeNationalనకిలీ ఖాదీ మాస్కులు అమ్ముతున్న మహిళ పై కేసు!

నకిలీ ఖాదీ మాస్కులు అమ్ముతున్న మహిళ పై కేసు!

FAKE-KHADI-MASKS-IN-CHANDIGARH

న్యూ ఢిల్లీ: ఖాదీ పేరిట “నకిలీ” మాస్కులు అమ్ముతున్నట్లు గమనించి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తెలుసుకున్న ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) సోమవారం చండీగడ్ నివాసిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చండీగడ్ లోని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌కు ఇచ్చిన ఫిర్యాదులో, ఖుష్బూ అనే మహిళ ఫేస్ మాస్క్‌లను ఖాదీ అని బ్రాండ్ చేసి, అనధికారంగా ప్రధానమంత్రి ఫోటోను ప్యాకెట్లలో ఉపయోగిస్తున్నట్లు ఆరోపించారు.

మహిళ విక్రయించే మాస్కులపై ఖాదీ లోగోలు మరియు కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా‘ మరియు ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాల పేర్లు కూడా ఉన్నాయి, ప్రధానమంత్రి ఛాయాచిత్రంతో పాటు ఖాదీ ఉత్పత్తులు అమ్మడానికి ఆమె పోర్టల్‌కు అధికారం ఉందని ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టించిందని పేర్కొన్నారు.

ఫిర్యాదు గురించి కెవిఐసి చైర్మన్ వినాయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ, “ఖాదీ పేరును దుర్వినియోగం చేస్తున్న ఉత్పత్తులు లేదా ప్రకటనలపై, అలాగే ప్రధానమంత్రి ఫోటోను అనధికారికంగా ఉపయోగిస్తున్న ఏ వ్యక్తిగత లేదా ప్రైవేట్ సంస్థలను మేము వదిలిపెట్టము. ఇది తీవ్రమైన ఉల్లంఘన మరియు నేరపూరిత చర్య గతంలో కూడా ఇలాంటి ఉల్లంఘనదారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. ” అని తెలిపారు.

FAKE KHADI MASKS IN CHANDIGARH | FAKE KHADI MASKS IN CHANDIGARH

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular