తమిళనాడు: తమిళనాడులో కృష్ణగిరిలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
నకిలీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సిసి) శిబిరంలో పాల్గొన్న 13 మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ క్యాంప్ నిర్వాహకులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులు, కరస్పాండెంట్‌తో సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నెల ప్రారంభంలో కృష్ణగిరిలో జరిగిన మూడు రోజుల ఎన్సిసి శిబిరంలో 17 మంది బాలికలతో పాటు 41 మంది బాలురు పాల్గొన్నారు. బాలికల కోసం పాఠశాల ఆడిటోరియంలో వసతి కల్పించగా, బాలురకు గ్రౌండ్ ఫ్లోర్లో వసతి ఏర్పాటు చేశారు.
శిబిరాన్ని పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులను నియమించలేదు. దీనివల్ల వారు లైంగిక వేధింపులకు గురయ్యారు. బాలికలు ఆడిటోరియం నుంచి బయటకు తీసుకువెళ్లి లైంగికంగా వేధించారని ఆరోపణలు చేశారు.
పాఠశాల అధికారులు ఈ లైంగిక నేరాల గురించి తెలుసుకున్నప్పటికీ, విషయాన్ని గోప్యంగా ఉంచాలని భావించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బదులుగా విద్యార్థులను ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు.
పోలీసుల విచారణలో, ఆ ప్రైవేట్ పాఠశాలలో ఎన్సిసి యూనిట్ లేదని తేలింది. ఎన్సిసి యూనిట్‌కు అర్హత పొందడానికి శిబిరాన్ని నిర్వహించడం అవసరమని నిర్వాహకులు చెప్పినట్లు పాఠశాల యాజమాన్యం చెప్పింది. నకిలీ ఎన్సిసి క్యాంపు వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇంకా ఇతర పాఠశాలల్లో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహించబడాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.