మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రస్తుతం బాక్సాఫీస్‌ను శాసిస్తోంది.
విడుదలైన నాలుగు వారాల్లోనే ఈ చిత్రం రూ.1800 కోట్ల గ్రాస్‌ను రాబట్టి ‘బాహుబలి 2’ రికార్డును క్రాస్ చేసింది.
ఈ విజయం పుష్పరాజ్ ఫ్యాన్స్‌కు పండగలా మారింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలోనూ ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ రావడం గమనార్హం.
ఇప్పటికే థియేట్రికల్ రన్ ఐదో వారంలోకి అడుగుపెట్టిన ‘పుష్ప 2’ మేకర్స్ మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
సినిమాకు అదనంగా 18 నిమిషాల కొత్త కంటెంట్ యాడ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ సీన్స్ ద్వారా ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతిని అందించాలనుకుంటున్నారట.
ఇది థియేటర్ ప్రింట్‌లో జోడిస్తారా, లేక ఓటీటీ వెర్షన్ కోసం ఉంచుతారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
అయితే ఈ ఎక్స్‌ట్రా సీన్స్ యాడ్ చేయడం ద్వారా మరలా ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించవచ్చని భావిస్తున్నారు.
అందులో ప్రధాన పాత్రలు, పుష్పరాజ్ కొత్త షేడ్స్ ఉంటాయనే అంచనాలు పెరుగుతున్నాయి.
మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్తలు ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
సంక్రాంతి సందర్భంగా ఈ కంటెంట్ విడుదలైతే బాక్సాఫీస్ వద్ద పుష్ప హవా మరింత పటిష్టమవుతుందని టాక్.
మరి ఈ కొత్త ఎలిమెంట్స్ కలెక్షన్స్‌కి ఎంత వరకు బూస్ట్ ఇస్తాయో చూడాలి!