బాలీవుడ్: హిందీ లో ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ కొడుకుగా కథా రచయితగా, డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు ఫర్హాన్ అక్తర్. మొదటి సినిమానే ‘దిల్ చాహతా హై’ లాంటి సినిమాని రూపొందించి నేషనల్ అవార్డు సాధించారు ఫర్హాన్ అక్తర్. ఆ తర్వాత డైరెక్టర్ గా కొన్ని సినిమాలు తీసి నటన వైపు అడుగులు వేసాడు. కొన్ని సంవత్సరాల క్రితం ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాతో అద్భుతమైన నటన కనబరిచారు. మిల్కా సింగ్ బయోపిక్ గా రూపొందిన ఈ సినిమాని రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్ట్ చేసారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన ఫీల్ తో సాగుతుంది. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి మరో స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా ని రూపొందించారు, అదే ‘తూఫాన్’. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
ముంబై లోని గల్లీల్లో ఫైట్స్ చేస్తూ రౌడీ గా ఉండే అజీజ్(ఫర్హాన్) కొన్ని దెబ్బలు తగిలి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ట్రీట్మెంట్ నిరాకరించి హిత బోధ చేసి అదే ఫైటింగ్ బాక్సింగ్ రింగ్ లో చేయమని పేరు, పరువు ఉంటుందని చెప్పడం తో బాక్సింగ్ వైపు దృష్టి మరల్చి అందులో విజయవంతం అవుతాడు ఫర్హాన్. కొన్ని కారణాల వలన తన పై నిందలు పడి 5 సంవత్సరాలు బాక్సింగ్ బాన్ ఎదుర్కొంటాడు. 5 సంవత్సరాల తర్వాత తన వైఫ్ ఐన అదే డాక్టర్ మళ్ళీ ఎంకరేజ్ చేసి బాక్సింగ్ వైపు అడుగులు వేయిస్తుంది. మళ్ళీ బాక్సింగ్ రింగ్ లోకి అడుగు పెట్టిన ఫర్హాన్ ఎలాంటి విజయాలు సాధించాడు అనేది సినిమా కథ అని అర్ధం అవుతుంది.
ఈ క్రమం లో అజీజ్ పాత్రలో ఫర్హాన్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసాడు, తన పై మోపిన నిందలు నిరాధారం అని రుజువు చేశాడా లేదా అనేది సినిమా వచ్చే వరకు వేచి చూడాలి. భాగ్ మిల్కా భాగ్ తర్వాత మరో సారి ఫర్హాన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్టు తెలుస్తుంది. సినిమా ట్రైలర్ కామెడీ, లవ్, ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ థాకూర్ అలాగే కోచ్ పాత్రలో పరేష్ రావల్ నటిస్తున్నట్టు ట్రైలర్ లో తెలుస్తుంది. రితేష్ సిద్వానీ, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా మరియు ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా జులై 16 న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలవుతుంది.