న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ప్రవేశ పెట్టిన చట్టాల వల్ల దేశంలో రైతులు తీవ్ర వ్యతిరేకత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన వ్యవసాయ చట్టాలపై చర్చల సందర్భంగా ప్రభుత్వంతో కలిసి భోజనం చేయడానికి రైతులు నిరాకరించారు. మధ్యాహ్న భోజన విరామంలో, ప్రభుత్వం అందించే ఆహారానికి రైతులు “నో” అన్నారు. మా భోఝనం మేము తెచ్చుకున్నాం అని చెప్పారు.
రైతులు ఇలా అన్నారు, “వారు మాకు ఆహారాన్ని అందించారు, మేము తిరస్కరించాము మరియు మేము మాతో తెచ్చిన మా భోజనాన్ని తీసుకుని వచ్చాం”, అని ఒక రైతు నాయకుడు ఈ సందర్భంగా తెలిపారు.
“మేము ప్రభుత్వం అందించే ఆహారం లేదా టీని అంగీకరించడం లేదు. మేము మా స్వంత ఆహారాన్ని తీసుకువచ్చాము” అని మరో రైతు నాయకుడు చెప్పారు. సమావేశం జరుగుతున్న ఢిల్లీ విజ్ఞాన్ భవన్ నుండి విజువల్స్, 40 మంది ప్రతినిధులు మధ్యాహ్నం భోజనం పంచుకున్నట్లు చూపించారు.