fbpx
Friday, January 10, 2025
HomeAndhra Pradeshకారుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే ఫాస్టాగ్ ఉండాల్సిందే

కారుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే ఫాస్టాగ్ ఉండాల్సిందే

FASTAG-MANDATORY-FOR-FITNESS-CERTIFICATES-AP

అమరావతి: రానున్న 2021 జనవరి 1నుంచి రాష్ట్రంలోని భారీ, చిన్న వాహనాలకు ఫాస్టాగ్ ఉండడం‌ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 డిసెంబర్‌ నుంచి దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఈటీసీ) విధానం అమలు చేయాలని నిర్ణయించినా అది ఇప్పటికీ పూర్తిగా సాధ్యపడలేదు.

దాని తర్వాత కోవిడ్‌ కారణంగా కూడా ఈ విధానం అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీ నుంచి వాహనానికి ఫాస్టాగ్‌ ఉంటేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మోటారు వాహన చట్టం–1989ను సవరించడం ద్వారా ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం నూతన వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 డిసెంబర్‌కు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్‌ ఉండాలని కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో రవాణా శాఖ ఇప్పుడు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular