బాలీవుడ్: ఈ మధ్యే ఇండియా లో పబ్- జి బాన్ చేసారు. అయితే దీని కంటే ముందు నుండే ఫౌజీ ( FAU – G ) అనే ఒక గేమ్ తయారు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయానికి అంటే అక్టోబర్ చివరి వరికల్లా ఆ గేమ్ లాంచ్ అవబోతోంది. దీన్ని ప్రకటించారు అక్షయ్ కుమార్. ఇందులో వినోదం తో పాటు ఆటగాళ్లు ఇండియన్ ఆర్మీ త్యాగాలని తెలుసుకుంటారు అని అక్షయ్ చెప్పారు. ఈ గేమ్ అప్ లోంచి వచ్చే ఆదాయంలో ఇరవై శాతం ‘భారత్ కె వీర్’ అనే ట్రస్ట్ కి వచ్చి చేరుతుందని కూడా చెప్పారు.
‘భారత్ కె వీర్’ అనే సంస్థ ఇండియా యొక్క సైనికులకు సహకారం అందిస్తుంది. ప్రధాన మంత్రి ప్రకటించిన ఆత్మా నిర్బర్ మూవ్మెంట్ ని సపోర్ట్ చేస్తూ బెంగుళూరు లో ఉన్న ఒక సాఫ్ట్ వెర్ సంస్థ ఈ ఆటకి సంబందించిన ఆప్ ని రూపొందిస్తుంది. పబ్-జి లాంటి ఆతని ఆడి కాలాన్ని వృధా చేసుకునే వాళ్ళు ఇలాంటి ఆప్ లో ఆడడం వలన దేశ సైన్యం గురించి తెలుసుకోవడం తో పాటు దేశ సైనికుల సేవ నిధి కి సహకారం అందించిన వారు కూడా అవుతారు.