టాలీవుడ్: పూర్తి తెలుగు కంటెంట్ అనే టాగ్ లైన్ తో ఆహా ఓటీటీ ప్రారంభించింది. మొదటి సంవత్సరం కంటెంట్ కోసం, రీచ్ కోసం బాగానే ప్రయత్నించింది. ఒక దశలో ఆహా పని అయిపోయింది అనుకున్నారు. కానీ కరోనా వలన లాక్ డౌన్ వలన మంచి సినిమాలు కొంటూ, ఓటీటీ కోసం సెపెరేట్ కంటెంట్ తయారు చేస్తూ దూసుకు వెళ్తుంది. అంతే కాకుండా వేరే భాషల్లో విడుదలైన పాత హిట్ సినిమాల్ని డబ్ చేసి తెలుగులో విడుదల చేస్తూ కంటెంట్ ని పెంచుకుంటుంది. ఇపుడు సరిగ్గా ఇదే మార్గాన్ని ఈ మద్యే మొదలైన మరో ఓటీటీ ఫాలో అవుతుంది.
రామ్ గోపాల్ వర్మ ఆశీస్సులతో మొదలైన స్పార్క్ ఓటీటీ ఆర్జీవీ రూపొందించిన ‘D కంపెనీ’ సినిమాతో మొదలయింది. తర్వాత ‘క్యాబ్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ ని విడుదల చేసింది. ఇపుడు ఆహా మాదిరిగానే వేరే భాషల్లో విడుదలైన కంటెంట్ ని డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తమిళ్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఒక థ్రిల్లర్ సినిమా ని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ‘ఫియర్’ అనే టైటిల్ తో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ని స్పార్క్ వారు డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన టీజర్ ఈ రోజు విడుదలైంది. రజిని కాంత్ కబాలి ద్వారా ఫేమస్ అయిన ధన్సిక ఈ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించింది.