మూవీడెస్క్: సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పరిస్థితి అనుకూలంగా మారింది.
హైకోర్టు తీర్పు తక్షణమే వెలువడడంతో అల్లు అర్జున్ జైలులో రాత్రి గడపాల్సిన పరిస్థితి తప్పింది.
ఈ కేసులో హైకోర్టులో జరిగిన వాదనల్లో ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
నిరంజన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ, ఓ ప్రముఖ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు.
అల్లు అర్జున్ తరఫున వాదన చేయడం మాత్రమే కాకుండా, తన దృఢమైన పాయింట్లతో కోర్టును ప్రభావితం చేశారు.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లాయర్‌గా సేవలు అందించిన నిరంజన్ రెడ్డి, ఈసారి అల్లు అర్జున్‌కు అండగా నిలబడ్డారు.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నిరంజన్ రెడ్డి తన ప్రతీ గంటకు 5 లక్షల ఫీజు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.
అయితే, ఈ రోజు కోర్టులో చూపించిన నైపుణ్యం, దృఢమైన వాదనల వల్ల ఆయన ఈ ఫీజుకు పూర్తి స్థాయిలో అర్హుడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నిరంజన్ రెడ్డి నిర్మాతగానూ రానిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్‌లతో “ఆచార్య” సినిమాను నిర్మించిన ఆయన, అల్లు అర్జున్‌ను అత్యవసర పరిస్థితిలో రక్షించి తన నైపుణ్యాన్ని మరోసారి రుజువుచేశారు.