బాలీవుడ్: యంగ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ సూసైడ్ చాలా మంది సినీ అభిమానులని షాక్ కి గురిచేసింది. ఇప్పటికే సుశాంత్ మరణం గురించి ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ లోని కొందరు ప్రముఖుల్ని విచారించారు ఇంకా కొందరిని విచారించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో కొత్త మలుపు ప్రారంభం ఐంది. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ రియాపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియా చక్రవర్తి సుశాంత్‌ను మోసం చేసిందని.. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిందని ఆయన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.సుశాంత్ ఆత్మహత్య విషయంలో రియాపై కూడా ఆరోపణలు వస్తున్నాయి.
పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో సుశాంత్ తండ్రి ఏం చెప్పారంటే… సంవత్సర కాలంగా .. రూ. 17 కోట్లలో ఒక తెలియని వ్యక్తికి రూ. 15 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయని.. ఇందులో రియా పాత్ర ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని పోలీసులను ఆయన కోరారు. దీంతో FIR నమోదు చేసుకున్న బీహార్ పోలీసులు ఆమెను ప్రశ్నించేందుకు ముంబై వచ్చి ఆమె నివాసానికి వెళ్లారు. బీహార్ పోలీసులు రావడానికి ముందే ఆమె తన ఇంటి నుంచి వీళ్ళిపోయింది . దీంతో పోలీసులు ఆమె కోసం సెర్చ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసు విచారణను బీహార్ నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ఆమె తరపు న్యాయవాది సతీవ్ మనీషిండే తెలిపారు.
సుశాంత్ సింగ్ తో రియా చక్రవర్తి అనుసరించిన విధానం కూడా ఆమెపై అనుమానాలు రేకేత్తేలా చేస్తున్నాయని.. మార్చి 8న సుశాంత్ కు నమ్మకస్తుడైన బాడీగార్డును రియా తొలగించడంతో పాటు సుశాంత్ స్టాఫ్ ని కూడా మార్చేసిందని.. ఈ క్రమంలో సుశాంత్ ను ఒంటరివాడిననే ఫీలింగ్ కలిగించేందుకు కుట్రలు పన్నారని ఆరోపిస్తున్నారు.ఇదేకాకుండా డిప్రెషన్ పేరుతో సుశాంత్ కు మోతాదుకు మించి మెడిసిన్స్ అందించి మానసికంగా శారీరకంగా సుశాంత్ ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారని ఆమెపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రియా ఆర్థిక విషయాలపై.. సుశాంత్ తో మొదలుపెట్టిన వ్యాపార వ్యవహారాలపై పోలీసులు ఆరా తీసే అవకాశాలున్నాయి.ఈ కేసు విచారణ పూర్తయితే కానీ రియాపై వస్తున్న ఆరోపణలు అనుమానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.