ఏపీ: మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ వద్ద భారీగా మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనకు టీడీపీ, జనసేన మద్దతుదారులు కారణమంటూ వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ పెద్దగా ఇంట్లో ఉండకపోయినా, భద్రత పెంచాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అయితే, ఈ అగ్ని ప్రమాదం ఎటువంటి కారణాలతో జరిగిందనేది ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు చేయిస్తోంది.
పోలీసులు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని కోరగా, జగన్ ఇంటి నిర్వాహకులు అక్కడున్నవి డమ్మీ కెమెరాలని తెలిపారు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ముఖ్యమంత్రిగా ఎనిమిది నెలల క్రితం వరకు ఉన్న జగన్ ఇంటి ముందు అసలు కెమెరాలు ఎందుకు లేవన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటనపై టీడీపీ, జనసేన మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. అగ్ని ప్రమాదం జగన్‌పై సానుభూతి తెచ్చేందుకు కావాలని జరిగిన డ్రామా అనుకుంటున్నారా? లేదా నిజంగా ప్రమాదమా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
సీసీటీవీ విజువల్స్ లేకపోవడం, విచారణలో అనేక అనుమానాలు రాకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అగ్ని ప్రమాదానికి నిజమైన కారణం ఏమిటో తేలాల్సి ఉంది.