న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్ నగరం కాల్పులతో ఒక్క సారిగా ఉలిక్కి పడింది. బ్రూక్లిన్ సబ్ వే స్టేసన్ వద్ద ఇవాళ ఈ ఘటన చోటు చేసుకుంది. సబ్ వేలో ఉన్న కొంత మంది ప్రయాణికులపై ముసుగులో వచ్చిన ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
కాగా ఈ దాడికి ముందు స్మోకింగ్ గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు కూడా నిర్ధారణ జరిగింది. ఈ దాడిలో 13 మంది గాయపడినట్లు సమాచారం. అయితే ఇప్పటివర్కౌ మృతుల సమాచారం అందలేదు. బ్రూక్లిన్‌లోని సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.
అదే సమయంలో రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు కూడా సంభవించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కథనాలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. అలాగే పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఎటువంటి సమాచారం లేదు.