టాలీవుడ్: కరోనా వల్ల దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దానికి సినిమాలు, థియేటర్లు మినహాయింపు ఏమి కాదు. ఇపుడు ఇప్పుడే విడతల వారీ అన్లాక్ లో భాగంగా థియేటర్ లు తెరచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్ 15 నుండి థియేటర్ లు తెరిచేందుకు థియేటర్ యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అన్నిట్లో ముందుండే రామ్ గోపాల్ వర్మ ఈ విషయం లో కూడా తాను ముందు వరుసలో ఉన్నానని చెప్పాడు.
తాను ప్రస్తుతం తీస్తున్న ‘కరోనా వైరస్’ అనే సినీమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే థియేటర్ లు తెరచుకోగానే ఈ సినిమాని కరోనా తర్వాత థియేటర్లలో విడుదల చేసే మొదటి సినిమాగా రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలు తీసి వాటిని ఏటీటీల ద్వారా రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించాడు వర్మ. అదే సమయంలో ‘కరోనా వైరస్’ అనే సినిమా రూపొందించాడు. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. వర్మ క్రియేట్ చేసిన ‘కరోనా వైరస్’ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. అలాగే థియేటర్ లలో విడుదల చేయడానికి రామ్ నటించిన ‘రెడ్’, మెగా హీరో మొదటి సినీమా ‘ఉప్పెన’ ముఖ్యంగా లైన్ అప్ లో టాప్ పోసిషన్ లో ఉన్నాయి. ఆ తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘లవ్ స్టోరీ ‘ ముఖ్యంగా చెప్పుకునే సినిమాలు.