fbpx
Thursday, April 3, 2025
HomeMovie Newsజాతిరత్నాలు: ఫస్ట్ లిరిక్ విడుదల

జాతిరత్నాలు: ఫస్ట్ లిరిక్ విడుదల

FirstLyric ReleasedFrom JaathiRatnaaluMovie

టాలీవుడ్: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా ద్వారా అందరి చూపు తన వైపు తిప్పుకున్న హీరో ‘నవీన్ పోలిశెట్టి’. మొదట చిన్న చిన్న పాత్రలు వేసి తర్వాత ముంబై కి వెళ్లి యుట్యూబ్ లో ఫేమస్ అయ్యి ‘చిచోరా’ అనే హిందీ సినిమాలో హీరో కి సమాన గుర్తింపు పొందిన నటుడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ ఆత్రేయ ఇచ్చిన సక్సెస్ తర్వాత ప్రస్తుతం అతని నుండి వస్తున్న సినిమా ‘జాతి రత్నాలు’. ఈ మధ్య ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన స్పందన లభించింది. సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ థియేటర్ లు తెరచుకోకపోవడం తో సినిమాని ఇంకా విడుదల చేయలేదు. ఇపుడు విడుదలవుతున్న సినిమాలకి రెస్పాన్స్ బాగుండడం తో ఈ సినిమాని కూడా విడుదల చేసే క్రమం లో మెల్లి మెల్లిగా పబ్లిసిటీ మొదలు పెట్టారు సినిమా నిర్మాతలు.

ఈ సినిమా నుండి ప్రస్తుతం మొదటి పాట ని విడుదల చేసారు. ‘చిట్టి నా బుల్ బుల్ చిట్టి’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. స్వప్న సినిమాస్ బ్యానర్ పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి తో పాటు ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. కే.వీ.అనుదీప్ దర్శకత్వంలో పూర్తి కామెడీ ఎంటర్టైనర్ లాగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ ముగ్గురి కామెడీ టైమింగ్ తెల్సిన విషయమే, ఇంకా ఈ సినిమా ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తుంది అంటే థియేటర్లలో వీళ్ళ కామెడీ కి రెస్పాన్స్ ఊహించవచ్చు. ఈ సమ్మర్ వారికి ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యనే దాదా సాహెబ్ అవార్డు పొందిన నవీన్ ఈ సినిమాని కూడా హిట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు.

Chitti Lyrical Video Song | Jathi Ratnalu | Naveen Polishetty, Faria | Radhan | Anudeep K V

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular