టాలీవుడ్: చాయ్ బిస్కెట్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఫేమస్ అయ్యి తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ హీరో గా నటిస్తున్న సినిమా ‘కలర్ ఫోటో‘. అదే చాయ్ బిస్కెట్ టీం నుండి వచ్చిన సందీప్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుహాస్ తో పాటు ఈ సినిమాలో తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తుంది. ఈ సినిమానుండి ఇవాళ మొదటి పాటని సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేసాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ బాగానే ఆకట్టుకున్నాయి.
‘తరగతి గది దాటి తరలిన కథకి ‘ అంటూ సాగే ఈ పాట మంచి మెలోడీ గా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న కాళ భైరవ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా కూడా మంచి మార్కులు కొట్టేట్టు ఉన్నాడు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం కూడా సినిమా కథకి బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. సినిమా టీజర్, పాటని బట్టి చూస్తుంటే నితిన్ ‘జయం’ లాంటి సినిమాతో పోలుస్తున్నప్పటికీ అందరూ కొత్తవాళ్లు అలాగే తమ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా ప్రూవ్ చేసుకున్న ఈ సినిమా టీం పై మాత్రం చాలా అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ విల్లన్ గా చేయడం ప్రత్యేకత. వైవా హర్ష కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.