కోలీవుడ్: తమిళ్ స్టార్ హీరో ‘విశాల్‘ ప్రస్తుతం చక్ర అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాలో విశాల్ ఒక ఆర్మీ మేజర్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్స్ ఆకట్టుకున్నాయి. విశాల్ నుండి వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘అభిమన్యుడు’ తరహా లోనే ఒక సైబర్ క్రైమ్ నేపధ్యం లో ఆధునిక టెక్నికల్ హంగులతో పూర్తి యాక్షన్ సినిమా లాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళ్ లో పందెంకోడి 2 , యాక్షన్ లాంటి యావరేజ్ సినిమా తర్వాత మంచి హిట్ కొట్టాలని విశాల్ ఎదురుచూస్తున్నాడు.
ఈ సినిమా నుండి ‘హర్లా హర్లా’ అంటూ సాగే మొదటి పాట విడుదలైంది. విశాల్ కి ఎన్నో సూపర్ హిట్ పాటలు అందించిన యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందించాడు. విశాల్ తో పాటు జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్, రెజినా కాసాండ్రా, శ్రీష్టి, మనో బాల, రోబో శంకర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి బాలసుబ్రమణ్యం ఛాయాగ్రహణం చేస్తున్నారు.ఈ సినిమాతో పాటు విశాల్ డిటెక్టివ్ సీక్వెల్ స్వీయ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు ఐన మిస్కిన్ ని బడ్జెట్ కారణాల దృష్ట్యా తొలగించి విశాల్ ఏ స్వయంగా దర్శకత్వం చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.