మూవీడెస్క్: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ప్రమోషన్ కార్యక్రమాలు మరింత హైప్ పెంచాయి.
తండేల్ సినిమా కోసం చైతన్య శ్రీకాకుళం ప్రాంతంలో కొన్ని రోజుల పాటు గడిపారు.
వారి జీవన విధానాన్ని దగ్గరుండి అధ్యయనం చేసి, వారి కష్టాలను అర్థం చేసుకున్నారు.
షూటింగ్ సమయంలో మత్స్యకారులతో కలిసి చేపల పులుసు వండడమే కాకుండా, కట్టెల పొయ్యి పద్దతిలో పచ్చి రుచి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
విడుదల చేసిన వీడియోలో ఆయన వంట చేసే పద్ధతి, స్థానిక సాంప్రదాయాలను పాటించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది.
గ్రామస్థులు నాగ చైతన్య పట్ల గౌరవం పెంచుకున్నారు. ఈ అనుభవం, ఆయన పాత్రకు నిజమైన నైజం తీసుకొచ్చిందని దర్శకుడు చందు మొండేటి అభిప్రాయపడ్డారు.
తండేల్ చిత్రం మత్స్యకారుల జీవన విధానం, వారి అనుభవాలను అందంగా హైలైట్ చేస్తూ ప్రేక్షకులను అలరించనుంది.
నాగ చైతన్య చేసిన కృషి ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.