పారిస్: గత సంవత్సరం కరోనా తో మొదలైన వైరస్ భీభత్సం తరువాత కరోనా కొత్త వేరియంట్ లతో దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ మళ్ళి ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్ కేసులు ప్రపంచంలోని అన్ని దేశాలలో తన కోరలు చాస్తూ వెళ్తోంది. అయితే తాజాగా మరోవైపు ఫ్రాన్స్‌లో ఇంకొక కొత్త కోవిడ్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఫ్రాన్స్‌లో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్ రకాన్ని శాస్త్రవేత్తలు తాజాగా కనుక్కున్నారు.
అయితే ఈ కరోనా వేరియంట్ ను శాస్త్రవేత్తలు బి.1.640.2గా నిర్దారణ చేశారు. ఇప్పటికే ఫ్రాన్స్‌లో ఈ వేరియంట్ బారిన 12 మంది కూడా పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్‌లో 46 కొత్త మ్యుటేషన్‌లు ఉన్నట్లు శాస్త్రవేత్తల రీసర్చ్ లో తెలిసినట్లు సమాచారం.