టాలీవుడ్: కరోనా కి ముందు ప్రతి శుక్రవారం సినిమాల విడుదల హడావిడి ఉండేది. కరోనా కారణంగా చాలా రోజులు ఆ హంగామా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్ప్డుడు ఫ్రైడే రిలీజెస్ ఊపందుకున్నాయి. క్రాక్, ఉప్పెన సక్సెస్ ల తర్వాత థియేటర్లలో 100 % ఆకుపెన్సీ ఇచ్చిన తర్వాత బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుంది. ఈ శుక్రవారం కూడా ఐదు సినిమాలు విడులవుతున్నాయి. ఈరోజు రెండు సినిమాలు డైరెక్ట్ తెలుగు, ఒక తమిళ్ డబ్, ఒక కన్నడ డబ్ మరియు ఒక ఇంగ్లీష్ సినిమా విడుదలవుతున్నాయి.
అల్లరి నరేష్ కొత్త రకమైన కథతో వస్తున్న ‘నాంది’ సినిమా ఈరోజు విడుదలవుతుంది. నరేష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, సినిమా పైన చాలా అంచనాలు పెట్టుకున్నాడు. అక్కినేని హీరో సుమంత్ ‘కపటదారి’ అనే సినిమాతో ఈరోజు థియేటర్లలో పలకరించబోతున్నాడు. కన్నడ లో సూపర్ హిట్ అయిన ‘కవుల్దారి’ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందింది.
తమిళ్ హీరో విశాల్ అభిమన్యుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అలాంటి నేపథ్యంలో మరోసారి సైబర్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ‘చక్ర’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా ఐదు భాషల్లో ఈరోజు విడుదల అవుతుంది. కన్నడ హీరో ధృవ్ సర్జ, రష్మిక మందన్న నటించిన ‘పొగరు’ సినిమా తెలుగు వెర్షన్ ఈరోజు విడుదల అవుతుంది. ఇవే కాకుండా పిల్ల, పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇష్టపడే కార్టూన్ ‘టామ్ అండ్ జెర్రీ’ హాలీవుడ్ మూవీ కూడా ఈరోజు విడుదల అవుతుంది. చాలా రోజుల తర్వాత థియేటర్లు అన్ని కొత్త సినిమాలతో ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర నిలదొక్కుకుంటాయో చూడాలి.