ఒకప్పుడు శుక్రవారం రాగానే సినిమాలు థియేటర్ లో విడుదల అయ్యేవి. కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఫ్రైడే వస్తే ఓటీటీ లో ఏ ఏ సినిమాలు విడుదల ఐతున్నాయో చూసుకోవాల్సి వస్తుంది. ఈ ఫ్రైడే విషయానికి వస్తే మూడు భాషల్లో మూడు సినిమాలు మూడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే తెలుగు లో అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర , సలోని జంటగా నటించిన ‘భానుమతి అండ్ రామకృష్ణ’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా ‘aha‘ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవ్వబోతోంది. 33 ఏళ్ల పల్లెటూరి అబ్బాయి, సిటీ అమ్మాయి మధ్యలో జరిగే లవ్ స్టోరీపైన తీసిన సినిమా ఇది. ఇప్పటికే విడుదల అయినా టీజర్స్ , ట్రైలర్స్ వీక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.
మలయాళం లో ‘చెలియా’ ఫేమ్ అదితి రావు హైదరి నటించిన ‘సూఫీయుమ్ సుజాతయుమ్’ అనే అద్భుతమైన మ్యూజికల్ లవ్ స్టోరీ కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. హిందూ ముస్లిం మధ్య జరిగే ప్రేమని ఇతివృత్తం గా ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ట్రైలర్, మ్యూజిక్ బాగానే ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కూడా ఈ శుక్రవారం ‘అమెజాన్ ప్రైమ్‘ లో విడుదల అవుతుంది.
తమిళ్ లో ‘నిశ్శబ్దం’ అనే మరొక సినిమా zee5 ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతుంది. ఒక చిన్న పాపకి ఉన్న ఒక అనారోగ్యం, దానికి ట్రీట్మెంట్ చేయించే స్తొమత లేని తల్లి తండ్రులు వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాలతో కూడిన సినిమాగా టాక్ ఉంది. మంచి ఎమోషనల్ గా సాగిపోయే ఈ సినిమా కూడా ఈ శుక్రవారం డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతుంది.