అమరావతి: రాజధాని నిర్మాణం కోసం నిధుల కొరత సమస్యను ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించింది. మొదటి దశలో అవసరమైన రూ. 50,000 కోట్లకు మార్గం సుగమం అయింది.
ఈ నిధులు బడ్జెట్ కేటాయింపులు, బాండ్ల విక్రయాలు, ప్రపంచ బ్యాంకు మరియు హడ్కో రుణాల ద్వారా సమీకరించనున్నారు.
తాజాగా కేంద్రం రూ. 15,000 కోట్ల రుణానికి, రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ. 3,445 కోట్లకు కేటాయింపులు జరిపింది. హడ్కో సంస్థ కూడా రూ. 12,000 కోట్ల రుణానికి అంగీకరించగా, మరో రూ. 23,000 కోట్లను బాండ్ల విక్రయం, హ్యాపీ నెస్ట్ గృహ ప్రాజెక్టు ద్వారా సమీకరించనున్నారు.
అమరావతిలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పెరిగిన అడవి నిర్మూలనకు రూ. 38 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు.
రానున్న రోజుల్లో ప్రాథమిక నిర్మాణ పనులకు బడ్జెట్ కేటాయించిన నిధులను వినియోగిస్తారు. ఈ నెలలోనే టెండర్లు పిలిపించి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ నాటికి ప్రాజెక్టులు పూర్తి దిశగా పరిగెత్తనున్నాయి.