ముంబై: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. వరుస పరాజయాలతో జట్టు ఒత్తిడిలో ఉండగా, కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం.
వీరిద్దరి మధ్య చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలో ప్రాధాన్యతలు, వ్యూహాల విషయంలో వివాదం నడిచిందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
గంభీర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించాలన్నాడట, అయితే రోహిత్ శుబ్‌మన్ గిల్‌ను అందుకోసే దృష్టిలో పెట్టుకున్నాడు.
ఈ అంశంలో సెలెక్షన్ కమిటీ గిల్ వైపే మొగ్గుచూపిందని తెలుస్తోంది. అలాగే వికెట్ కీపర్ విషయంలో సంజూ శాంసన్ అనేదే గంభీర్ అభిప్రాయం కాగా, రోహిత్ మాత్రం రిషబ్ పంత్‌నే నమ్మకంగా నిలిపాడు.
సెలెక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ రోహిత్‌కు మద్దతుగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విభేదాలు జట్టు కూర్పుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందనే అభిప్రాయాలు నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు.
గంభీర్, రోహిత్ ఇద్దరూ తమ ఇగోలను పక్కన పెట్టి జట్టు విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అభిప్రాయపడుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తున్న ఈ తరుణంలో జట్టు అంతర్గత విభేదాలు భారత్ విజయావకాశాలను దెబ్బతీయవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.