fbpx
Tuesday, January 7, 2025
HomeMovie Newsగేమ్ ఛేంజర్ ఫ్యాన్స్ విషాదం.. అండగా పవన్, దిల్ రాజు

గేమ్ ఛేంజర్ ఫ్యాన్స్ విషాదం.. అండగా పవన్, దిల్ రాజు

GAME-CHANGER-EVENT-INCIDENT-PAWAN-DILRAJU-EXTEND-HELP-VICTIMS
GAME-CHANGER-EVENT-INCIDENT-PAWAN-DILRAJU-EXTEND-HELP-VICTIMS

మూవీడెస్క్: రాజమహేంద్రవరం గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఈ ఈవెంట్‌కు హాజరైన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే యువకులు రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన వీరు, ఈ ఘటనతో వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచివేశారు.

ఈ విషాదంపై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వారి కుటుంబాలకు అండగా నిలుస్తాం, అంటూ చెరో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఘటన తమకు గుండెల్లో బాద కలిగించిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన సానుభూతి ప్రకటిస్తూ, బాధిత కుటుంబాలకు జనసేన తరఫున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.

ఏడీబీ రహదారి చెత్తస్థితి కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే రహదారి పునర్నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పవన్, దిల్ రాజు చేసిన ఈ ప్రకటనలు బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఈ విషాదం అందరినీ తీవ్రంగా కలచివేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular