మూవీడెస్క్: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కావాల్సి ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తూ, ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాలని దిల్ రాజు భావిస్తున్నారని సమాచారం.
రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో సినిమాల ఈవెంట్లకు పెద్దగా హాజరుకాలేదు.
అయితే, ‘గేమ్ ఛేంజర్’ కోసం వస్తే, సినిమా హైప్ మరో స్థాయికి చేరుతుందని యూనిట్ భావిస్తోంది.
ఈ ఈవెంట్ కోసం తాడేపల్లి, కాకినాడ, విజయవాడ వంటి ప్రదేశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రామ్ చరణ్ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో ఫ్లాష్ బ్యాక్ పాత్ర ఎక్కువ ఆకర్షణగా నిలవనుందని చిత్ర బృందం పేర్కొంది.
సామాజిక అంశాలను చర్చించే కథతో పాటు, శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే, రామ్ చరణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.
పవన్ హాజరైతే ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్‌కు మరింత ఊతం దక్కుతుందని అందరూ భావిస్తున్నారు.
మరి, దిల్ రాజు ప్రణాళికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.