మూవీడెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉన్నప్పటికీ, ఈ సినిమా పై క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ యూఎస్ మార్కెట్‌లో పెద్ద అంచనాలు నెలకొల్పుతోంది.
ఇటీవల ప్రీమియర్ షోలు మరియు అడ్వాన్స్ బుకింగ్స్ సంఖ్యను పరిశీలిస్తే, ఈ సినిమా పుష్ప 2తో పోలిస్తే మరింత హవా చూపిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
రామ్ చరణ్ ‘RRR’తో గ్లోబల్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే క్రేజ్ ‘గేమ్ ఛేంజర్’ పై స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు 537 ప్రీమియర్ షోల బుకింగ్‌లతోనే $61K వసూళ్లను రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో అల్లు అర్జున్ పుష్ప 2 కంటే ఎక్కువ స్పీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది .
‘గేమ్ ఛేంజర్’ బజ్, రామ్ చరణ్ స్టార్‌డమ్ ఈ సినిమాను సూపర్ హిట్ రేంజ్‌లో నిలబెడతాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
శంకర్ మేకింగ్‌లో కనిపించే గ్రాండియర్‌తో పాటు పొలిటికల్ థ్రిల్లర్ అంశం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
గేమ్ ఛేంజర్ ప్రీ బుకింగ్‌ల ఫలితాలు చూస్తుంటే, ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.