మూవీడెస్క్: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రానుంది.
శంకర్ దర్శకత్వంలో రూపొందిన తొలి తెలుగు సినిమా కావడం, రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయడం వంటి కారణాలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే, శంకర్ గత చిత్రం ఇండియన్ 2 పరాజయం చెందడం వల్ల మెగా ఫ్యాన్స్ లో కాస్త భయం కూడా నెలకొంది.
ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లో ఓ ఐఏఎస్ ఆఫీసర్ సిస్టమ్ పై పోరాడే కథతో రూపొందింది.
చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఫస్ట్ హాఫ్ సాధారణంగా ఉంటుందని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అత్యద్భుతంగా ఉంటుందట.
రామ్ చరణ్ కాలేజ్ సీన్స్, ఎస్‌జే సూర్య పవర్ఫుల్ ఇన్ట్రో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది.
ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అవుతుందని, సెకండ్ హాఫ్ లో చరణ్ పాత్ర సామాజిక అంశాలను చర్చిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తుందని టాక్.
అంజలి పాత్ర ఎమోషనల్ గా ఆకట్టుకుంటుందట. సుకుమార్ ఇప్పటికే ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని చెబుతూ మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం కలిగించారు.
ఈ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, శంకర్ ఈ సినిమా ద్వారా తన సత్తా చాటతారని, రామ్ చరణ్ కూడా మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను మెప్పిస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరి ఈ గేమ్ నిజంగానే చేంజ్ అవుతుందా? వేచి చూడాల్సిందే.