మూవీడెస్క్: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, రామ్ చరణ్ నటన అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుండగా, శంకర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మరింత హైప్ క్రియేట్ చేశాయి.
ఈవెంట్‌లో శంకర్ మాట్లాడుతూ, “ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవి. నాకు అలాంటి సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది.
గేమ్ ఛేంజర్ అలాంటి తరహాలో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది,” అని చెప్పారు.
సినిమా కథ, రామ్ చరణ్ ప్రదర్శన సినిమాకి మెయిన్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని ఆయన తెలిపారు.
రామ్ చరణ్ ఒక అధికారిగా, పొలిటికల్ సిస్టమ్‌ను ఎదుర్కొంటున్న క్యారెక్టర్‌ను పూర్తిగా న్యాయం చేశారని శంకర్ ప్రశంసించారు.
కియారా అద్వానీ, అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ వంటి నటీనటుల ప్రదర్శన సినిమాకు ప్రాణం పోసిందని అన్నారు.
ప్రత్యేకంగా తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు.
మేకర్స్ సినిమా కోసం ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యుత్తమ అవుట్‌పుట్ తీసుకువచ్చారని, ప్రేక్షకుల కోసం ఎంతో కష్టపడ్డామని శంకర్ చెప్పుకొచ్చారు.
సంక్రాంతి రేసులో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
మరి గేమ్ ఛేంజర్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి!