మూవీడెస్క్: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం గేమ్ ఛేంజర్ పైరసీ కారణంగా కష్టాలు ఎదుర్కొంటోంది.
భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే అంచనాలు పెంచుకున్నా, మిక్స్‌డ్ టాక్‌తో కలెక్షన్లు తగ్గుముఖం పట్టింది.
ఈ క్రమంలోనే టెలిగ్రామ్‌లో HD ప్రింట్ లీక్ కావడం, లొకల్ టీవీ చానల్‌లో ప్రసారం కావడం తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ స్పందిస్తూ, “ఒక సినిమా వెనుక వేల మంది కష్టాలు, నాలుగేళ్ల కృషి దాగుంది.
ఇలా అక్రమ ప్రసారాలు పరిశ్రమను ఎంతగానో దెబ్బతీస్తాయి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పెట్టుబడులపై నమ్మకం ఉంచి పని చేస్తారు. పైరసీ ఆగాలి,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
గేమ్ ఛేంజర్ చిత్ర బృందం ఇప్పటికే పైరసీకి సంబంధించిన సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది.
సినిమాలో కీలక సన్నివేశాలు లీక్ చేస్తామని బెదిరించిన 45 మంది వ్యక్తులపై ఆధారాలతో చర్యలు కోరింది.
టాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి ఈ ఘటన గట్టి హెచ్చరికగా మారింది.
ఈ పరిణామాలు చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని పరిశ్రమ ప్రముఖులు కోరుతున్నారు.