మూవీడెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ జనవరి 10న థియేటర్లలో సందడి చేయబోతోంది.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పటివరకు విడుదలైన పాటలు ట్రెండ్ అయినా, చిత్రానికి కావాల్సిన హైప్ మాత్రం ఇంకా రాలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
సినిమాలోని పాటల కోసం 70 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. సాంగ్స్ విజువల్స్ పైన ఆడియన్స్‌లో ఆసక్తి పెరిగింది.
ఇక ట్రైలర్ కోసం ఫ్యాన్స్ కాకుండా రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
ట్రైలర్ విడుదల తర్వాత గేమ్ చేంజర్ పై పాజిటివ్ బజ్ పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతున్నాయి. 1134 షోల కోసం ప్రీసేల్ డిసెంబర్‌లోనే మొదలైంది.
కానీ ఇప్పటి వరకు కేవలం $383.4K మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో యూఎస్‌లో 13,022 టికెట్లు బుక్ అవగా, కెనడాలో 544 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
ట్రైలర్ విడుదలైన తర్వాత బుకింగ్స్ రేటు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పుష్ప 2 వంటి సినిమాలు నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా భారీ కలెక్షన్లు సాధించాయి.
గేమ్ చేంజర్ కూడా అదే రీతిలో ప్రీసేల్ ఊపందుకుంటే, బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించే ఛాన్స్ ఉందని నెటిజన్లు నమ్ముతున్నారు.
మరి ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా ఎలా దూసుకుపోతుందో చూడాలి.