fbpx
Wednesday, September 18, 2024
HomeMovie Newsగేమ్ చేంజర్.. మళ్ళీ ఊహించని ట్విస్ట్?

గేమ్ చేంజర్.. మళ్ళీ ఊహించని ట్విస్ట్?

GAME-CHANGER-SEEMS-COMING-IN-2025
GAME-CHANGER-SEEMS-COMING-IN-2025

మూవీడెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీపై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు.

దర్శకుడు శంకర్ భారీ అంచనాల మధ్య స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్, మధ్యలో భారతీయుడు 2 షూటింగ్ తో కొంత ఆలస్యం అయింది.

కానీ చివరకు షూటింగ్ పూర్తి చేసుకొని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కేవలం ఒకటే సాంగ్ రిలీజ్ కాగా, అది కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.

సెకండ్ సింగిల్, మరికొన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పట్ల కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక పబ్లిక్ అటెన్షన్ మరోసారి గేమ్ చేంజర్ పైకి మళ్లించే విధంగా అదిరిపోయే అప్డేట్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా రిలీజ్ 2025కి వాయిదా పడుతుందన్న వార్తలు వచ్చాయి.

డిసెంబర్ నెలలో పుష్ప 2తో పాటు నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ లాంటి సినిమాలు కూడా వస్తుండటంతో, కాంపిటీషన్ వల్ల సినిమా వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

ఇది నిజమా, కేవలం ఊహాగానమా అన్నది ఇప్పటి వరకు అధికారికంగా దిల్ రాజు టీమ్ నుంచి క్లారిటీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular