రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేకెత్తించింది. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్ విడుదలతో సినిమా పై అంచనాలు మరో స్థాయికి చేరాయి.
ట్రైలర్‌లో కొన్ని సీన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నందన్ కలెక్టర్‌గా, SJ సూర్య పవర్ఫుల్ పొలిటీషియన్‌గా ఆకట్టుకున్నారు. “కడుపునిండా వంద ముద్దలు తినే ఏనుగు, ఒక్క ముద్ద వదిలిపెడితే లక్ష చీమలకు ఆహారం” అనే డైలాగ్ అందరినీ ఆలోచనలో పడేసింది.
అలాగే, “మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు” అనే డైలాగ్ సందేశాత్మకంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో గ్రాండ్ విజువల్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అద్భుతంగా మిళితమయ్యాయి.
సినిమా కథ సామాజిక సందేశంతోపాటు కమర్షియల్ హంగులను కలగలిపేలా సాగుతుందని ట్రైలర్ స్పష్టత ఇచ్చింది. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాయిమాధవ్ బుర్ర రాసిన డైలాగ్‌లు సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేలా చేశాయి.
మొత్తానికి గేమ్ ఛేంజర్ ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను కలిగించింది. ఈ సంక్రాంతికి ఈ సినిమా బిగ్ స్క్రీన్‌పై సంచలన విజయం సాధిస్తుందేమో చూడాలి.