మూవీడెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రమోషన్లతో మేకర్స్ ఫుల్ బిజీగా ఉంటూ, రీసెంట్ గా డల్లాస్ లో జరిగిన ఈవెంట్ తో యూఎస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
అయితే, గేమ్ ఛేంజర్ ప్రీ బుకింగ్స్ విషయానికి వస్తే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది.
ఇప్పటి వరకు యూఎస్ ప్రీ బుకింగ్స్ ద్వారా కేవలం $281K మాత్రమే వసూలు చేయడం గమనార్హం.
మిగతా పాన్ ఇండియా చిత్రాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
2024లో రిలీజ్ కు ముందు ప్రీ బుకింగ్స్ లో ఎన్టీఆర్ దేవర $1.04 మిలియన్ తో టాప్ లో ఉండగా, పుష్ప 2 $1 మిలియన్ తో రెండో స్థానంలో నిలిచింది.
ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ కలెక్షన్లు మరింత పెరగాల్సిన అవసరం ఉంది. బజ్ పెంచేందుకు మేకర్స్ మరిన్ని ప్రమోషన్ స్ట్రాటజీలు అవలంబించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రీసెంట్ గా డల్లాస్ లో ఈవెంట్ నిర్వహించినప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ లో గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయికి చేరలేకపోయింది.
ఓవర్సీస్ మార్కెట్ నుంచి భారీ వసూళ్లు రాబట్టాలంటే, సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడం చాలా కీలకం.