షార్జా: ఐపిఎల్ 2020 కోసం సన్నాహాలను సమీక్షించడానికి మూడు వేదికలలో ఒకటైన షార్జా క్రికెట్ స్టేడియంను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోమవారం సందర్శించారు.
భారత దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల కారణంగా ఐపిఎల్ 2020 ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కు తరలించారు. గంగూలీతో పాటు స్థానిక ప్రముఖులు, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా తదితరులు ఉన్నారు. స్థానిక అధికారులు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి చెందిన భారత మాజీ కెప్టెన్ తన పర్యటన నుండి కొన్ని చిత్రాలను పంచుకున్నారు మరియు ఇలా రాశారు: “ప్రసిద్ధ షార్జా స్టేడియం ఐపిఎల్ 2020 కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది”.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత తమ ప్రీ-సీజన్ ప్రారంభించడానికి మొత్తం ఎనిమిది జట్ల ఆటగాళ్ళు మరియు సహాయక సిబ్బంది గత నెలలో యుఎఇకి వచ్చారు. క్రీడాకారులు ఇప్పుడు దాదాపు ఒక నెల నుండి శిక్షణ పొందుతున్నారు మరియు టోర్నమెంట్‌లో అన్ని అస్త్రాలను సందించి, టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్న అభిమానుల ముఖాల్లో చిరునవ్వు తేనున్నారు.
ఐపిఎల్ 2020 కి ముందు సన్నాహాలను పర్యవేక్షించడానికి గంగూలీ గత వారం యుఎఇకి బయలుదేరారు – ఇది సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 మధ్య మూడు వేదికలైన దుబాయ్, అబుదాబి మరియు షార్జాలలో జరుగుతుంది. ఐపిఎల్ 2020 ప్రారంభ మ్యాచ్ అబుదాబిలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మరియు గత సంవత్సరం రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది.
షార్జా క్రికెట్ స్టేడియంలో మొత్తం 12 లీగ్ దశల మ్యాచ్‌లు నిర్వహించనున్నాయి, సెప్టెంబర్ 22 న రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడతాయి.