తెలంగాణ: అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ తన ఉదాత్తతను మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రసంగానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై ఆయన మంగళవారం అసెంబ్లీలో బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
సోమవారం సభలో సునీత మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ ఆఫ్ చేయడం, ఆ వెంటనే “నాకే వినాలనిపించదు” అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. స్పీకర్ స్థానంలో ఉండి మహిళా సభ్యురాలి గురించి ఇలా మాట్లాడటం సరైందా? అనే ప్రశ్నలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే మంగళవారం సభ ప్రారంభం కాగానే గెడ్డం ప్రసాద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. “సునీత లక్ష్మారెడ్డి గౌరవనీయులు. నా మాటల వల్ల ఆమె మనసు బాధపడిందంటే, నేనే బాధపడతాను. నా వ్యాఖ్యలను ఉపసంహరిస్తున్నాను,” అని వెల్లడించారు.
ఈ హితబోధతో ఆయన తన వ్యక్తిత్వం, పదవికి తగిన శైలి ఏంటో నిరూపించారు. స్పీకర్ స్థాయికి మించిపోయిన వ్యాఖ్యలు చేసినా, వెంటనే బాధ్యతగా స్పందించడమే గెడ్డం ప్రసాద్‌కు ప్రజల గౌరవం తీసుకొచ్చింది.