fbpx
Monday, January 20, 2025
HomeTelanganaఘట్‌కేసర్‌ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌

ఘట్‌కేసర్‌ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌

GHATKESAR-STUDENT-COMMIT-SUICIDE

రంగారెడ్డి: తెలంగాణలో సంచలనం రెపిన కిడ్నాప్‌ డ్రామాతో నగరంలో కలకలం సృష్టించిన ఒక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ కేసులో ఒక కొత్త ట్విస్ట్‌ వెలుగు చూసింది. సదరు యువతి మంగళవారం మధ్యాహ్నం షుగర్‌ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని సమాచారం.

అది తెలిసిన యువతి కుటుంబ సభ్యులు మొదట ఆమెని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. చికిత్స అనంతరం యువతిని ఇంటికి పంపించారు వైద్యులు. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోయాక యువతి మరోసారి షుగర్‌ మాత్రలు మింగినట్లు తెలిసింది.

ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున యువతి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెని ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తనకు చికిత్స కొనసాగుతుండగానే ఆ యువతి మరణించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular