న్యూఢిల్లీ: ఈ మెయిల్ సర్విసెస్ మొదలైనప్పటి నుండి అత్యంత ఆదరణ పొందిన మెయుల్ సర్విస్ ఏదీ అంటే అందరూ టక్కున చేప్పే సమధానం జీమెయిల్. దీనిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాదాపుగా ప్రతి ఒక్కరూ జీమెయిల్ ఐడీని ఖచ్చితంగా వాడుతున్నారు.
ఈ రోజు జీమెయిల్ సర్విసులు కాస్త మొరయిస్తున్నాయని యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. కొందరు మెయిల్ లోకి లాగిన్ కాలెకపోతుంటే, కొందరు లాగిన్ అయినా కుడా అటచ్మెంట్స్ అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ చేయలేకున్నరని సమాచారం. జీమెయిల్ తో పాటు గూగుల్ డ్రైవ్ కూడా పని చేయట్లెదు అని రిపోర్ట్ చేస్తున్నారు.
అయితే ఈ సమస్య కేవలం భారత్ లోనే కాకుండా జపాన్, ఆస్ట్రేలియా, కెనడా సహా ఇతర దేశాలలో కూడా ఉన్నట్లు డౌన్ డిటెక్టర్ అనే ఒక సంస్థ తెలిపింది. ఈ విషయం పై గూగుల్ స్పందిస్తూ, విషయం తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
సమస్య ఎక్కడా వచ్చిందో నిశితంగా పరిసీలిస్తున్నామని, పరిష్కారం అవగానే పరిస్థితి యొక్క తాజా సమాచారం అందజేస్తామని గూగుల్ కంపెనీ తెలిపింది. మరి వేచి చూడాలి ఎంత సమయంలో సమస్య పరిష్కారం అవుతుందో.