ముంబై: ప్రపంచ బంగారం సంకేతాల మధ్య ధరలు వరుసగా రెండో రోజు కూడా పడీ పోయాయి. 2021 మొదటి నుంచి ఓలటైల్‌గా ఉన్న బంగారు ధరలు రికార్డు స్థాయిల దిగువకు చేరుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో రెండు సెషన్లలో నష్టపోతూ ఆల్ టైం గరిష్టం నుంచి దాదాపు 7వేల రూపాయల మేర పడిపోయింది.
ఈ రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 49,328 రూపాయల వద్ద ఉంది. వెండి అదే దారిలో ఉంది. కిలోకు 175 రూపాయల మేర క్షీణించింది. ఫిబ్రవరి బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములకి 0.03% తగ్గి డాలర్లకు చేరుకోగా, వెండి ఫ్యూచర్స్ 0.22% క్షీణించి కిలోకు, 65,414 కు చేరుకుంది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.333.00 (0.68శాతం ) పెరిగి రూ.49,300.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.328.00 (0.67శాతం) పెరిగి రూ.49,340 వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం పసిడి ధర భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.
కాగా అంతర్జాతీయంగా బంగారం ధర 0.7శాతం పెరిగింది. స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.2శాతంపెరిగి 1,847.96 డాలర్ల వద్ద ఉండగా, వెండి 0.8శాతం పెరిగి 25.11 డాలర్లకు చేరుకుంది. హైదరాబాద్ లో సుమారు 440 రూపాయలు క్షీణించి 10 గ్రాముల22 క్యారెట్ల పసిడి ధర 45,900, 24 క్యారెట్ల ధర 50070 వద్ద ఉంది. వెండి ధర కిలోకి 69,600 పలుకుతోంది.
మూడేళ్ల కనిష్టం నుండి యుఎస్ డాలర్ పుంజుకోవడంతో పాటు, అమెరికా 10 సంవత్సరాల యుఎస్ బాండ్ ఈల్డ్స్ ఎగిసాయి. ఈ నెల చివర్లో అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ఉద్దీపన ప్యాకేజీని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీనికి తోడు తక్కువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.