ముంబై: కొత్తగా మీరు బంగారం కొనాలని ఆలోస్తున్నారా? అయితే, ఈ శుభవార్త మీ కోసమే. మార్కెట్లో ఇవాళ బంగారం ధర బాగా తగ్గింది. భారత దేశీయ మార్కెట్లో ఇవాళ రూపాయి విలువ పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
గోల్డ్ ధర ఎంసీఎక్స్ లో ఇవాళ తో కలిపి వరుసగా మూడవ రోజు కూడా తగ్గుదల నమోదు చేసింది. యూఎస్ డాలర్ తో పోలిస్తే దాదాపు మూడు నెలల గరిష్ట స్థాయిలో 73 రూపాయల వద్ద భారత రూపీ ముగిసింది. ఇందువల్ల దిగుమతులపై ఆ ప్రభావం భారీగా పడింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.47,424 నుంచి రూ.47,287కు పడినట్లు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది.
కాగా బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో మాత్రం స్థిరంగానే ఉన్నాయి. అత్యధిక స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,330గా ఉంటే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300గా ఉంది. బంగారం ధర తో పాటు వెండి ధర కూడా భారీగానే తగ్గింది. ఇవాళ మార్కెట్లో కిలో వెండి ధర రూ.62,957గా ఉంది.