న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఎప్పుడూ ముందు ఉంటుంది. బంగారానికి భారత్‌లో ఉన్నంత డిమాండ్ మరే దేశానికి ఉండదు. మహిళలు బంగారాన్ని అలంకరణ కోసం వాడుతుంటే, మగవారు మాత్రం పెట్టుబడుల కోసం కొనుగులు చేస్తారు.
కగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది. గత వారం రోజులుగా రోజూ పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ మాత్రం భారీగా పెరిగింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,587 నుంచి రూ.48,975కు పెరగింది. ఇక, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,506 నుంచి రూ.44,861కు చేరుకుంది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.45,810 నుంచి రూ.45,900కు పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,070కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ ఏర్పడింది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలోపై రూ.782 పెరగడం ద్వారా రూ.71,370కు చేరింది.