ముంబై: కొన్నాళ్ళు భారీగా తగ్గిన బంగారం ధరలు తాజాగా గత ఏప్రిల్ 1 నుంచి వరుసగా పెరుగుతుంది. ఈ లెక్క చాలు బంగారం ధరలు పెరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోవడానికి ఒకవైపు దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
మరోవైపు బంగారం ధర కూడా పెరుగుతోంది. కేవలం గత ఏడు రోజుల్లోనే బంగారం ధర దాదాపు రూ.1000 పెరగడం విశేషం.
ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,421 నుంచి రూ.45,904కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,606 నుంచి 42,048కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.442 రూపాయలు పెరిగింది.
కాగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.42,400 నుంచి రూ.42,650కు ఎగబాకింది. అంటే నిన్నటి నుంచి ధర ఒక్క సారి రూ.250 పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,250 నుంచి రూ.46,530కు పెరిగింది ఉంది. అంటే ఒక్కరోజులో రూ.280 రూపాయలు పెరిగింది అన్నమాట.
హైదరాబాద్ మరియు విజయవాడలో ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. నేడు కేజీ వెండి ధర రూ.65,600 నుంచి కూడా రూ.66,139కు పెరిగింది. బంగారం ధర హెచ్చుతగ్గులు అనేది ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది.