మూవీడెస్క్: ప్రియాంక అరుళ్ మోహన్ ఇటీవలి కాలంలో తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
సరిపోదా శనివారం సినిమాతో మరోసారి నాని సరసన నటించిన ఆమె బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
తెలుగు ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకున్న ప్రియాంక, వరుస సినిమాలతో సినీ పరిశ్రమలో స్థిరపడుతోంది.
గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు చిత్రరంగంలో అడుగుపెట్టిన ప్రియాంక, ఆ తర్వాత తమిళ చిత్రాలతో కూడా తన కేరీర్‌ను విస్తరించుకుంటోంది.
ధనుష్‌తో కలిసి నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో ఆమె మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పుడు, పవన్ కళ్యాణ్ సరసన ఓజీ సినిమాలో నటించటం ఆమె కెరీర్ కు మరో పెద్ద అవకాశం.
ఇప్పుడు, విశ్వక్ సేన్‌తో కూడా నటించనుందట. విశ్వక్ అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో ప్రియాంక నటించే అవకాశం ఉందని సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌తో ఆమె తన కెరీర్‌లో మరో కీలక మలుపు సాధించబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగు చిత్రసీమలో ఆమెకి వస్తున్న వరుస అవకాశాలు చూస్తుంటే, మిగతా స్టార్ బ్యూటీలకు గట్టి పోటీ ఇచ్చేలా ఉందని అనిపిస్తుంది.