ఆంధ్రప్రదేశ్‌లో పామాయిల్ రైతులకు బహుళ ప్రయోజనాలు – టన్ను ధర రూ.19వేలకు పెంచిన చంద్రబాబు ప్రభుత్వం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పామాయిల్ రైతులకు సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం మరో సుభవార్త అందించింది. రైతుల సంక్షేమానికి కట్టుబడిన చంద్రబాబు ప్రభుత్వం పామాయిల్ సాగుదారుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పామాయిల్ ధరల్లో నిలకడ ఉండేందుకు, రైతులకు మంచి ఆదాయం కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజాగా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో అధికారుల, పామాయిల్ రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పామాయిల్ ధరను టన్నుకు రూ.19వేలకు ఫిక్స్ చేశారు. ఇంతకుముందు రూ.12,500 మాత్రమే ఉన్న ఈ ధర పెరుగుదలపై రైతుల్లో హర్షాతిరేఖాలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల్లోనే ఈ పెరుగుదల సాధించగలిగింది.
రైతులు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టన్నుకు రూ.23వేలు ధరను చూసి, అదే స్థాయి కొనసాగుతుందని ఆశించినా అది సాధ్యం కాలేదు. పంట సాగుచేసే రైతులు ఎకరా పొలానికి లక్ష రూపాయల కౌలును అడ్వాన్స్ గా ఇవ్వడంతో రూ.12వేలకు తగ్గింది. దీనివల్లే అన్నదాతలు నష్టపోయారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరను టన్నుకు రూ.19వేలకు పెంచుతూ, రైతుల ఆశలను పెంచింది.
పామాయిల్ దిగుమతులపై కేంద్రం సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచడంతో దేశీయంగా పామాయిల్ సాగుదారులకు మద్దతు లభించింది. దీని వల్ల రైతులకు మరింత లాభం చేకూరుతుంది. చంద్రబాబు ప్రభుత్వం భవిష్యత్తులో పామాయిల్ సాగు విస్తరణపై దృష్టి సారించి, పరిశ్రమల ప్రోత్సాహంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయంతో ఏపీలో పామాయిల్ సాగుదారులు పంటలపై గిట్టుబాటు ధర లభిస్తోందని, సాగును మరింత విస్తరించాలని అధికారుల ద్వారా సూచనలు అందాయి. ప్రభుత్వం తరఫు నుండి రైతులకు ఇలాంటి సహాయ చర్యలు కొనసాగుతాయని అధికారవర్గాలు తెలిపాయి.