fbpx
Sunday, March 9, 2025
HomeTelanganaతెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ శుభవార్త!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ శుభవార్త!

GOOD-NEWS-FROM-THE-GOVERNMENT-FOR-TELANGANA-RTC-EMPLOYEES!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ శుభవార్త!

డీఏ పెంపు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు 2.5 శాతం కరువు భత్యం (DA) పెంపును ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా ప్రతి నెల TSRTCపై రూ. 3.6 కోట్ల అదనపు భారం పడనుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ డీఏ అమలులోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు.

మహిళా సాధికారతలో ముందడుగు

మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘ఇందిర మహిళాశక్తి’ (Indira Mahila Shakti) బస్సులను ప్రారంభించనుంది. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా ఈ బస్సులు నడవనున్నాయి. తొలి దశలో 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన తీసుకోనున్నారు. తరువాతి దశలో 450 బస్సులను తీసుకోనున్నారు. మొత్తం 600 బస్సులను నడపనున్నారు. ఈ బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular